
నిందితులతో ఎస్సై స్వామి, సీసీఎస్ ఎస్సై రాజ్‌కుమార్
అత్తిలి: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై కేసీహెచ్ స్వామి చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి బాడువాలోగల ఇటుకల బట్టీలలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు పనిచేస్తున్నారు. గంజాయి అలవాటు ఉన్న వారు అక్కడ నుంచి గంజాయిని తీసుకువస్తున్నారని, ఇదే క్రమంలో గంజాయిని తొలుత చుట్టు ప్రక్కల ప్రాంతంలోను విక్రయిస్తున్నారన్నారు. గంజాయిపై మంచి ఆదాయం రావడంతో వారు జిల్లాలో పలు ప్రాంతాలలో గంజాయి వ్యాపారం విస్తరించారు. ఈక్రమంలో మంగళవారం వారు తణుకు వస్తుండగా మంచిలి వైజంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, మహ్మద్ అజ్గర్‌మూలా, మహ్మద్ సైపుల్, బిస్వజిత్‌దాస్‌ల వద్ద 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తణుకు రూరల్ ఇన్‌చార్జ్ సీఐ ఎం.సత్యనారాయణ కేసు నమోదు చేసి, నిందితులను తణుకు కోర్టులో హాజరుపర్చారు. సీసీఎస్ ఎస్సై ఎం రాజ్‌కుమార్ పాల్గొన్నారు.