కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద నన్నయ్య ఎంఎస్‌ఎన్ పీజీ సెంటర్‌లో వాణిజ్య, నిర్వహణ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన తలాష్ 2కే26 కార్యక్రమం ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర స్థాయి ఫెస్ట్‌గా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నన్న య యూనివర్సిటీ వీసీ ప్రసన్న శ్రీ, ఎలైట్ నేచురల్ ఆయి ల్స్ ఎండీ తోట సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. వీసీ ప్రస న్న శ్రీ మాట్లాడుతూ మేనేజ్‌మెంట్ అంటే కేవలం లెక్కలు, స్ప్రెడ్‌షీట్లు మాత్రమే కాదని అది ఒక సమగ్ర వ్యవస్థ అని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని కలిపి నడిపించే ప్రక్రియే మేనేజ్‌మెంట్ అన్నారు. మరో అతిథి తోట సుబ్రహ్మణ్యం యువతలో ఆత్మ విశ్వాసం, స్టార్టప్ ఆలోచనలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి వివరించారు. ప్రిన్సిపాల్ ప్రశాంతి శ్రీ, మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ అంజిబాబు, ప్రోగ్రామ్ కన్వీనర్ మధుకుమార్ పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యాఽర్థులు సందడి చేశారు.


