సాక్షి, రాజమహేంద్రవరం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. గురువారం కురిసిన భారీ వర్షాలతో అనేకచోట్ల రోడ్లు వాననీటి ప్రవాహంతో కాలువలను తలపించాయి. పలుచోట్ల వాన నీటితో కలసి డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
కల‘వరి’పాటు
రెండు రోజులుగా జోరుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలకు వరి పైరులు నేలనంటుతున్నాయి. కంద, అరటి, తమలపాకు తదితర తోటల్లోకి నీరు చేరింది. ముఖ్యంగా ఖరీఫ్ వరి రైతులను ఈ వర్షాలు కలవరపరుస్తున్నాయి. పంట చేతికొస్తున్న దశలో వర్షాలు కురుస్తూండటంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. పైరు నేలకొరిగితే గింజలు రాలిపోయి నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 76,104 హెక్టార్లలో రైతులు ఖరీఫ్ వరి సాగు చేపట్టారు. చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు, నల్లజర్ల, నిడదవోలు, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ తదితర మండలాల్లో వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నాయి. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా 681 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో వరి పైరు ఈనిక, గింజ పాలు పోసుకునే దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో కురుస్తున్న వర్షాలకు కంకులు బరువెక్కి, పైరు నేల వాలిపోతే నష్టం భారీగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టామని, వర్షం ప్రభావంతో పంట తడిస్తే.. ఆశించిన దిగుబడి అందదని ఆవేదన చెందుతున్నారు.
ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నేటికీ ప్రారంభమైన దాఖలాల్లేవు. దీంతో, కోతలు పూర్తయిన పంటను భద్రపరచుకోలేక, ఒకవేళ అలాగే పెట్టుకుంటే వర్షానికి ఎక్కడ పాడవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక కొంత మంది దళారులకు తక్కువ ధరకే విక్రయించేస్తున్నారు. ఇదే అదునుగా దళారులు, వ్యాపారులు బస్తా ధాన్యానికి ధర రూ.300 వరకూ కోత పెడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగుకు పెట్టిన పెట్టుబడులు సైతం చేతికందే పరిస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు.
27న ప్రారంభించేందుకు కసరత్తు
ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 221 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తామని తెలిపారు. ఈ–పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. గ్రేడ్–ఎ రకం ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది.
MøÆý‡$-Mö…yýl Ð]l$…yýl-ÌS…ÌZ ˘
వరి కోతలు చేపడుతున్న కూలీలు
దేవరపల్లిలో వాన నీటితో కాలువను
తలపిస్తున్న బాలదుర్గమ్మ ఆలయం రోడ్డు
జిల్లాలో మండలాల వారీగా ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం (హెక్టార్లలో)
మండలం వరి సాగు
బిక్కవోలు 6,113
రాజమహేంద్రవరం రూరల్ 1,379
నల్లజర్ల 3,850
రాజానగరం 4,261
దేవరపల్లి 3,663
కొవ్వూరు 4,478
అనపర్తి 3,800
సీతానగరం 5,634
చాగల్లు 3,118
కడియం 2,137
నిడదవోలు 6,965
గోకవరం 5,493
పెరవలి 3,242
గోపాలపురం 4,918
ఉండ్రాజవరం 4,820
రంగంపేట 2,728
తాళ్లపూడి 3,738
కోరుకొండ 5,738
ఫ˘ hÌêÏÌZ Ð]l¬Ð]l$ÃÆý‡…V>
ఖరీఫ్ వరి కోతలు
ఫ˘ D ™èlÆý‡$׿…ÌZ gZÆý‡$V> Ð]lÆ>ÛË$
ఫ˘ ´÷ÌêÌZÏ ^ólÆý‡$™èl$¯]l² ±Æý‡$
ఫ˘ B…§øâýæ¯]lÌZ A¯]l²§é™èlË$
కోతలు ఆపితే మేలు
ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ పంటలకు ఎలాంటి ప్రమాదమూ లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు ఇలాగే కురిస్తే కొంత మేర పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కోతలు పూర్తయిన రైతులు ధాన్యం జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. వర్షం తగ్గుముఖం పట్టేంత వరకూ కోతలు ఆపితే మంచిది.
– ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి
వాన.. హైరానా
వాన.. హైరానా
వాన.. హైరానా
వాన.. హైరానా


