మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం గద్దె దిగాలి
రాజమహేద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వ అసమర్థ, అరాచక పాలనలో రాష్ట్రంలో మహిళలపై నిత్యం లైంగిక దాడులు జరుగుతున్నాయని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని బాలికల సంక్షేమ హాస్టల్ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ గురువారం ఆ వసతి గృహం వద్ద ధర్నా నిర్వహించారు. జోరు వానలో సైతం ధర్నా నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భరత్‌రామ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై ప్రతి రోజూ లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. వెలుగులోకి రాని ఘటనలు మరెన్నో ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం 24 గంటలూ మద్యం విక్రయించి, తాగిస్తున్నందు వల్లనే మహిళలపై లైంగిక దాడులు పెరిగాయని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతకానితనం వల్ల నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే ఒక మహిళను ప్రేమ పేరుతో నమ్మించి, మోసగించి, గర్భవతిని చేసి, తర్వాత గర్భంలోని పిండాన్ని చిదిమేశారని భరత్‌రామ్ మండిపడ్డారు. ఇప్పుడు బాలికల వసతి గృహంలోని విద్యార్థినిని దీపావళి రోజు బయటకు తీసుకువెళ్లి ఓ యువకుడు లైంగికదాడికి ఒడిగట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని బాలికలకు రక్షణ లేదన్నారు. ఇదంతా ఎమ్మెల్యే చేతకానితనం వల్లనే జరుగుతోందని భరత్‌రామ్ ధ్వజమెత్తారు. ధర్నాకు పోలీసులు అభ్యంతరం చెప్పినా.. వైఎస్సార్ సీపీ శ్రేణులు తమ ఆందోళన కొనసాగించాయి.
ఫ మాజీ ఎంపీ మార్గాని
భరత్‌రామ్ డిమాండ్
ఫ జోరు వానలో
వసతి గృహం వద్ద ధర్నా
మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం గద్దె దిగాలి
మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం గద్దె దిగాలి


