ఇసుక అక్రమ వ్యాపారానికి ఇదే సాక్ష్యం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తప్పుడు బిల్లులతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన్‌లో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరిగి వెళ్తూండగా.. స్థానిక ఐఎల్‌టీడీ రైతుబజార్ వద్ద భారీ ఇసుక లోడుతో వెళుతున్న లారీని ఆపి, బిల్లులు పరిశీలించారు. బిల్లు 25 టన్నుల ఇసుక రవాణాకు ఉండగా, దాదాపు 40 టన్నులు తరలిస్తున్నట్టు గుర్తించారు. అలాగే, నిబంధనలు ప్రకారం ఎటువంటి జాగ్రత్తలూ తీసుకోకపోవడంతో ఆ లారీ నుంచి ఇసుక రోడ్డుపై కారిపోతోంది. దీంతో, వెనుక వస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వేణు గుర్తించారు. దీనిపై జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌కు, ఆర్‌టీఓ సురేష్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇసుక అక్రమ రవాణాను తక్షణం అడ్డుకోవాలని కోరారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ వ్యాపారానికి ఇదే సాక్ష్యమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మద్యం, రేషన్ బియ్యం దోచేస్తున్నారని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడిగా చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గంలోనే ఇసుక దోపిడీ ఈ స్థాయిలో జరుగుతున్నప్పటికీ ఆయన ఉలుకూ పలుకూ లేకుండా ఉండటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దోపీడీదారుల నుంచి అందుతున్న ముడుపులే కారణమని ప్రజలు భావిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ర్యాంపును ఒక్కో కూటమి నాయకుడు పంచుకుని, ఇసుక దోపీడీకి పాల్పడుతున్నట్లుగా ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఉచితం పేరుతో గోదావరిలో డ్రెడ్జింగ్ చేసి మరీ ఇసుక తరలించుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 టన్నుల బిల్లుతో 40 టన్నుల ఇసుక రవాణా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని వేణు అన్నారు. ప్రజలకు చెందాల్సిన వస్తువులను కూటమి నాయకులు దోచుకుపోతూంటే.. కేవలం అరకొర కేసులతో మభ్యపెట్టడానికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప, అక్రమాలను అడ్డుకునేందుకు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజలకు సక్రమంగా అందాల్సిన ఇసుక, రేషన్ బియ్యం అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఇకపై నేరుగా పోరాడుతుందని వేణు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల వీర్రాజు (బాబు), డివిజన్ ఇన్‌చార్జి, పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు చీకురుమిల్లి చిన్న, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చొల్లంగి సత్యగిరి పాల్గొన్నారు.
·˘ OÐðlGÝëÞÆŠ‡ ïÜï³ hÌêÏ A«§ýlÅ„ýS$yýl$ Ðól׿$
·˘ ™èl糚yýl$ ¼Ë$ÏÌS™ø
వెళ్తున్న ఇసుక లారీ అడ్డగింపు


