
అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అమలాపురం రూరల్: తన పేరుపై ఉన్న భూమిని వేరే వ్యక్తి పేరున ఆన్‌లైన్‌లో మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి చెందిన రైతులు అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. సదరు భూమిని తిరిగి తన పేరున మార్చాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పలుసార్లు తిరిగినప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రలోభాలకు గురై వేరొకరి పేరున ఆన్‌లైన్ చేసిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతు ఆకుల నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భూమికి ఏవిధమైన దస్తావేజులు లేకుండా కుంపట్ల ఆదినారాయణ పేరున ఆన్‌లైన్‌లో అక్రమంగా నమోదు చేశారన్నారు. దీనిపై తనకు తగిన న్యాయం చేయాలని నాగేశ్వరరావు కోరారు.