96.85 శాతం ఉత్తీర్ణత
రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫరీక్షా ఫలితాలలో జిల్లాలోని విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 1, 3, 5, 7, 10 ర్యాంకులు సాధించారు. జిల్లాలో పాలిసెట్ ఫలితాలలో 96.85శాతం విద్యార్దులు అర్హత సాధించారు. జిల్లాలో 5,172 మంది పాలిసెట్‌కు హాజరుకాగా 5,009 మంది అర్హత సాధించారు. జిల్లాకు చెందిన బడ్డి శశివెంకట్ రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ర్యాంకు, మెర్ల జే ఎస్‌ఎన్‌వి చంద్రహర్ష రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు, వున్నా వరణ్‌తేజ్ రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు, ఆకుల నిరంజన్ శ్రీరామ్ రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు, బళ్ల రిషిత శ్రీస్వప్న రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించారని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాళాల, జిల్లా కోఆర్డినేటర్ వి.నాగేశ్వరరావు తెలిపారు.
జగనన్న కాలనీలో
ట్రాన్స్‌ఫార్మర్ల తొలగింపు
స్థానికుల ఆందోళన
జగ్గంపేట: స్థానిక జగనన్న కాలనీలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఐదు అధికారులు తొలగించడంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. దీనితో జగనన్నకాలనీ వాసులు ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి తోట నరసింహానికి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు తెలియజేశారు. దీంతోవారు జగ్గంపేట విద్యుత్ డీఈ వీరభధ్రరావుతో మాట్లాడి ట్రాన్స్‌ఫార్మర్లు జగనన్నకాలనీలో వున్నవి తీయడం సరికాదని తెలిపారు. అయితే వేసవి కారణంగా గ్రామంలో పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయకపోవడంతో జగనన్న కాలనీలో ప్రస్తుతం ఉపయోగించని ట్రాన్స్‌ఫార్మర్లు మారుస్తున్నామని విద్యుత్ డీఈ వారికి వివరించారు. జగ్గంపేటలో రెండు రోజులుగా పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, పాడైపోవడంతో పలు కాలనీలలో విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో జగనన్న కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్లు వాడుతున్నట్లు, కొత్తవి వచ్చిన వెంటనే జగనన్న కాలనీలో యథావిధిగా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
పాలిసెట్‌లో జిల్లాకు 1, 3, 5, 7, 10 ర్యాంకులు
పాలిసెట్‌లో జిల్లాకు 1, 3, 5, 7, 10 ర్యాంకులు
పాలిసెట్‌లో జిల్లాకు 1, 3, 5, 7, 10 ర్యాంకులు