
ఎకై ్సజ్ అధికారుల విస్తృత దాడులు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామ సమీప లంకలో వంద లీటర్ల సారాను ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట ఎకై ్సజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.కాత్యాయని బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా కొత్తపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా వాడపల్లి లంకలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 3,400 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అదే ప్రాంతంలో పలుచోట్ల వంద లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఆ సారాకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. జిల్లా ఈఎస్ ఎస్‌కేడీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఏఈఎస్ జి.అమర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో ఆలమూరు, రాజమహేంద్రవరం సీఐలు నాగేశ్వరరావు, పి.సుబ్బిరెడ్డి, అమలాపురం స్క్వాడ్ సీఐ చిరంజీవి, కొత్తపేట, రామచంద్రపురం, రాజమహేంద్రవరం స్టేషన్ల ఎస్సైలు కె.అన్నవరం, కె.సుబ్బారావు, బి.అప్పారావు, ఏ.రామానుజ, పి.సూర్యకుమారి, ఆయా స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
వంద లీటర్ల సారా స్వాధీనం
3,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం