
బ్యాటరీ వెహికల్ ఢీకొని ఇద్దరికి గాయాలు
రాజమహేహేంద్రవరం సిటీ: ప్రధాన రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను తరలించే బ్యాటరీ వెహికల్ ఢీకొని బుధవారం ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామానికి చెందిన ఎం.సాయి వల్లికాదేవి, విధులు నిర్వహించి ఇంటికి వెళుతున్న రైల్వే లోకో పైలట్ ఎంవీ రామారావును స్థానిక 2, 3 ప్లాట్‌ఫాంపై బ్యాటరీ వెహికల్ ఢీకొంది. ఈ ఘటనలో సాయివల్లికాదేవికి రెండు కాళ్లూ, రామా రావుకు ఒక కాలు విరిగిపోయాయి. ఈ ప్రమాదానికి కారకుడైన బ్యాటరీ వెహికల్ డ్రైవర్ పరారయ్యా డు. ఈ ప్రమాదంపై రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్సై లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదకరమే ...
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో బ్యాటరీ వాహనం ఏర్పాటు చేయడం ప్రమాదకరంగా తయారైంది. ఇక్కడి ప్లాట్‌ఫాంలు ఆ వెహికల్ రాకపోకలు సాగించేందుకు అనువుగా లేకపోవడమే దీనికి కారణం. బ్యాటరీ వాహనం నడిచేంత ఖాళీ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలిసినా రైల్వే అధికారులు మాత్రం బ్యాటరీ వాహనం నడిపేందుకు కాంట్రాక్టర్‌కు టెండర్ ద్వారా అప్పగించారు.
రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో ఘటన
పరారైన డ్రైవర్