
సీబీఎస్‌ఈ ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి విజయకేతనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సీబీఎస్‌ఈ 10, 12 వ తరగతి ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య మంగళవారం తెలిపారు. 12 తరగతి ఫలితాలలో ఎస్.స్నేహితశ్రీ 500 మార్కులకు 484 సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కె.పావన్‌తనయ 477 మార్కులతో ద్వితీయ స్థానం, ఎన్.విద్యాజ్యోతి శ్రీ 476 మార్కులతో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారన్నారు. మొత్తం 16 మంది విద్యార్థులు 95 శాతం పైగా మార్కులు సాధించగా, 54 మంది 90 శాతం, 216 మంది 75 శాతం పైగా మార్కులు సాధించారన్నారు. హాజరైన మొత్తం విద్యార్థుల్లో 339 మంది 60 శాతం పైగా మార్కులతో నూరు శాతం ఉతీర్ణత సాధించారన్నారు. 10వ తరగతి ఫలితాలలో పి.హర్షిత్ సాయి 500 మార్కులకుగాను 483 సాధించి ప్రథమస్థానాన్ని సాధించాడన్నారు. పి.రేవంత్ సత్య అనిరుధ్ 481 లతో ద్వితీయస్థానం, ప్రితీష్ పాలై 480తో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారన్నారు. 20 మంది విద్యార్థులు 95 శాతం సాధించగా 72 మంది 90 శాతం, 180 మంది 75 శాతం పైగా మార్కులు సాధించారన్నారు. హాజరైన మొత్తం 206 మంది విద్యార్థులు 60 శాతం పైగా మార్కులతో నూరు శాతం ఉతీర్ణత సాధించారన్నారు. తమ విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించడం పట్ల విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలైన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు.