
గడువు ముగిసిన బీరు బాటిళ్లు ధ్వంసం
తాళ్లపూడి: మండలంలోని తుపాకులగూడెం పరిధిలోగల బీరు ఫ్యాక్టరీలో కాలం చెల్లిపోయి నిల్వ ఉన్న సుమారు ఆరువేల కేసుల బీర్‌ను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలోయస్ బ్రావరిజస్‌కు చెందిన ఫ్యాక్టరీలో బీరు తయారు అవుతుంది. కొంతకాలంగా బీరు తయారీ నిలిచిపోయింది. దీంతో గోడౌన్ ఖాళీ చేయడంలో భాగంగా ఎకై ్సజ్ అధికారుల సమక్షంలో కాలం చెల్లిన బీరు సీసాల స్టాక్‌ను ధ్వంసం చేస్తున్నారు. సుమారు ఆరువేల కేసులను ధ్వంసం చేయాల్సి ఉండగా సోమవారం సుమారు 1,000 కేసుల బీర్ సీసాలను ధ్వంసం చేశారు. బుధవారం కూడా ఈ ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు.