
పీజీఆర్‌ఎస్‌కు 159 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 159 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కారంలో కచ్చితంగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి సీనియర్ అఖిల భారత సర్వీసెస్ అధికారులు మూడు రోజుల పర్యటించనున్నారని తెలిపారు. వారు ప్రజలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు. వచ్చిన అర్జీల్లో 24 గంటల్లో పరిష్కరించాల్సినవి 5, 48 గంటల్లో పరిష్కరించాల్సినవి 35, 72 గంటల్లో పరిష్కరించాల్సినవి 16 ఉన్నాయన్నారు. రీ ఓపెన్ అయినవి 137 ఉన్నాయని, వీటిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కారం సాధ్యం కాకుంటే ఆ విషయంపై అర్జీదారుకు అవగాహన కల్పించాలని సూచించారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 34 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం (పీజీఆర్‌ఎస్)కు 34 ఫిర్యాదులు అందాయి. జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్‌బీఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఏవీ సుబ్బరాజు పాల్గొన్ని అర్జీలు స్వీకరించారు. సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అర్జీలను చట్ట పరిధి ప్రకారం పరిష్కరించాలన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 159 అర్జీలు