
సీహెచ్‌ఓల డిమాండ్లు నెరవేర్చాలి
రాజమహేంద్రవరం రూరల్: సీహెచ్‌ఓల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (ఏపీఎంసీఏ) అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యాన సీహెచ్‌ఓలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 14వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని విద్యాసాగర్ సందర్శించి సీహెచ్‌ఓలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరేళ్లు నిండిన సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలనే నిబంధన ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇంక్రిమెంట్లు, ఇన్సెంటివ్‌లు లేక సీహెచ్‌ఓలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.మమత మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈపీఎఫ్‌ఓ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.