
రద్దీగా శృంగార వల్లభుని సన్నిధి
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి వారిని శనివారం వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. మొత్తం 15 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. వివిధ సేవల టికెట్ల ద్వారా రూ.2,05,750, అన్నదాన విరాళాలుగా రూ.76,031, కేశఖండన ద్వారా రూ.8,840, తులాభారం ద్వారా రూ.700, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.24,690 కలిపి స్వామివారికి రూ.3,16,011 ఆదాయం సమకూరిందని వివరించారు.
భక్తులతో కిక్కిరిసిన బాల తిరుపతి
మామిడికుదురు: బాల తిరుపతిగా భక్తుల పూజలందుకుంటున్న అప్పనపల్లి బాల బాలాజీ స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో స్వామివారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి సన్నిధిలో జరిగిన శ్రీలక్ష్మీ నారాయణ హోమంలో భక్తులు పాల్గొన్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.4,06,417 ఆదాయం వచ్చింది. 5,500 మంది భక్తులు దర్శించుకున్నారు. 3,200 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.1,01,381 విరాళాలుగా అందించారన్నారు.
నిత్యాన్నదాన పథకానికి విరాళం
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి ముంబైకి చెందిన దోనేపూడి జగదీష్ రూ.లక్ష, ఠానేలంకకు చెందిన జగత వెంకట గంగాధర్ రూ.10,116 విరాళం అందజేశారు. ఈ సొమ్మును దాతలు ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావుకు అందించారు.
భీమేశ్వరస్వామి ఆలయంలో..
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్‌కు విశాఖపట్నానికి చెందిన ఇమంది శ్రీనివాసరావు, పద్మలత దంపతులు శనివారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని చేతికి వారు నగదు అందించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను దాతలకు అందజేశారు.

రద్దీగా శృంగార వల్లభుని సన్నిధి

రద్దీగా శృంగార వల్లభుని సన్నిధి