
మద్దతు ధరకు కొనాలి
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా పని చేస్తున్నాయి. కొనే నాథుడు లేక 40 శాతం ధాన్యం ఎక్కడిదక్కడే ఉంది. ఎక్కువ శాతం దళారులే కొనుగోలు చేస్తున్నారు. దిగుబడి బాగున్నప్పటికి ధర లేక గిట్టుబాటు కావడం లేదు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పండిన ప్రతి గింజనూ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, రైతులను ఆదుకున్నారు. ఇప్పుడు మిర్చి, పెండలం, కోకో.. ఇలా రైతు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. కూటమి ప్రభుత్వంలో రైతులు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. రైతులకు సకాలంలో గోనె సంచులు అందించి, కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకే ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి.
– వల్లభనేని సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు,
వైఎస్సార్ సీపీ రైతు విభాగం, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం