గోదావరిలో వ్యక్తి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో వ్యక్తి మృతదేహం లభ్యం

Mar 28 2023 11:44 PM | Updated on Mar 28 2023 11:44 PM

కొవ్వూరు: పట్టణంలోని హిందూ శ్మశాన వాటిక సమీపాన గోదావరి నదిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ఎన్‌టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం వెలటూరు గ్రామానికి చెందిన చింతపల్లి రవికుమార్‌(34)గా గుర్తించారు. ఇతడు ఛారమ్స్‌ సిగరెట్స్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నా డు. తరచూ రాజమహేంద్రవరంలో నిర్వహించే కంపెనీ సమావేశాలకు వస్తూంటారు. ఈ నెల 26వ తేదీన ఇంటి నుంచి వచ్చిన రవికుమార్‌ అదే రోజు భార్యకు ఫోన్‌ చేసి తాను బయటకు వచ్చానని, ఇంటికి వస్తాను కంగారు పడవద్దని ఫోన్‌ చేశాడు. అనంతరం అతడి ఫోన్‌ స్విచాఫ్‌ అయ్యింది. అతడి కోసం గాలిస్తూండగా గోదావరి నదిలో మృతదేహం కనిపించిందని బావమరిది పత్తాల కుమారబాబు పట్టణ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై బి.దుర్గా ప్రసాద్‌ తెలిపారు. మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement