
రత్నగిరిపై నూతన ట్రస్ట్‌బోర్డు సమావేశం
అన్నవరం: స్థానిక వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం 2023–24 సంవత్సరం బడ్జెట్ రూ.156 కోట్లకు ట్రస్ట్‌బోర్డు ఆమోదం తెలిపింది. రత్నగిరిపై ట్రస్ట్‌బోర్డు సమావేశం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగింది. మొత్తం 40 అంశాలపై సభ్యులు చర్చించారు. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్ అజాద్ అజెండాలోని అంశాలను సభ్యులకు వివరించారు. ఏప్రిల్ 30 నుంచి మే 6 వరకు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకు గాను రూ.కోటికి పైగా ఖర్చు చేయాలని నిర్ణయించారు. జాతీయరహదారిపై విశాఖ–రాజమహేంద్రవరం వైపు 4.2 ఎకరాల స్థలంలో సత్యదేవుని నమూనా ఆలయం, ప్రసాదం కౌంటర్ నిర్మాణానికి, ఈ స్థలాన్ని హైవేకు సమానంగా 12 అడుగులు ఎత్తు చేయడానికి రూ.1.92 కోట్ల వ్యయంతో రూపొందించిన అంచనాలను ఆమోదించారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులు, దేవస్థానం ఈఓ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ అజాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హైవేపై నమూనా ఆలయం నిర్మాణానికి చర్యలు
దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సమావేశంలో నిర్ణయం