కోటసత్తెమ్మ హుండీ ఆదాయం రూ.28.18 లక్షలు

హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది - Sakshi

నిడదవోలు రూరల్‌: తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయ హుండీని సోమవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.28,18,577, అన్నదాన ట్రస్ట్‌ హుండీలో రూ.93,728, 24 గ్రాముల బంగారం, 587 గ్రాముల వెండి ఉన్నట్లు ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం (శివ) తెలిపారు. 88 రోజులకు సంబంధించి తాడేపల్లిగూడెం తనిఖీదారు ఎ.సుజన్‌కుమార్‌ పర్యవేక్షణలో ఆలయ కమిటీసభ్యులు, సిబ్బంది హుండీలోని నగదును లెక్కించారు. ఆలయ ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌, చైర్మన్‌ దేవులపల్లి రామసుబ్బరాయశాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, అయినీడి వెంకటకృష్ణ, మిద్దే శ్రీను, రేలంగి మారుతి శివభాస్కరరావు, ఉర్ల వీరవెంకటలక్ష్మి, బోనేపల్లి ఉమాదేవి, వద్దిరెడ్డి మహాలక్ష్మి, నిచ్చెనకోల భవానీ, ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి అంగవైకల్య

నిర్ధారణ శిబిరాలు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల వైకల్యం నిర్ధారణకు మంగళ, బుధవారాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం తెలిపారు. వైకల్య నిర్ధారణ పూర్తయ్యాక, అవసరమయ్యే ఉపకరణాలు అందజేస్తామన్నారు. శిబిరానికి హాజరయ్యే పిల్లలకు ఉచిత భోజనం, రవాణా ఖర్చులు ఇస్తామన్నారు. స్థానిక ఇన్నీసుపేట ప్రభుత్వ బాలికల హైస్కూల్లో మంగళవారం జరిగే వైద్య శిబిరానికి రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌, అనపర్తి, బిక్కవోలు, గోకవరం, కడియం, సీతానగరం, రాజానగరం, రంగంపేట, కోరుకొండ మండలాల నుంచి దివ్యాంగులు హాజరుకావాలన్నారు. దేవరపల్లి హైస్కూల్లో బుధవారం జరిగే శిబిరానికి చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, నల్లజర్ల, పెరవలి, ఉండ్రాజవరం మండలాల వారు రావాలన్నారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top