
గోకవరం: స్థానిక దేవీచౌక్ ఆలయానికి బుధవారం భక్తులు వెండి సమర్పించారు. ఆలయంలో అంతరాలయం గోపురం వెండి తాపడానికి భక్తులు సుమారు కేజీ వెండిని అందజేశారు. గ్రామానికి చెందిన దాసరి తమ్మన్నదొర మనవరాలు పబ్బినీడి సౌజన్య, రాజశేఖర్ దంపతులు 250 గ్రాములు, పోలరౌతు ప్రసాద్, వీరలక్ష్మి దంపతులు 500 గ్రాములు, దాసరి వీరబాబు, శిరీష దంపతులు 250 గ్రాముల వెండిని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాథశర్మ, శ్రీనివాస్‌శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.