అమలాపురం రూరల్: జిల్లా ఎస్‌జీఎస్‌డబ్ల్యూ ప్రధాన కార్యాల యంలో ఖాళీగా ఉన్న ఒక సహాయక జిల్లా కో ఆర్డినేటర్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ మంగళవారం వెల్లడించారు. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు డిగ్రీ అంతకు మించిన అర్హత ఉండాల న్నారు. దరఖాస్తులు ఈనెల 20, 21 తేదీలలో కలెక్టరేట్‌లో ఎస్‌జీ ఎస్‌డబ్ల్యూ సెక్షన్ కార్యాలయ పనివేళల్లో స్వీకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉద్యోగ భర్తీలో ఎటువంటి రిజర్వేషన్లు వర్తించవని ఆయన తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహించేది తరువాత తెలియజేస్తామని తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు కమాండ్
కంట్రోల్ రూమ్
అమలాపురం రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి జాన్ 4 వరకు నిర్వహిస్తునట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆయా తేదీల్లో ఆదివారాలతో సహా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 30 థియరీ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, పరీక్షల పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఫిర్యాదుల స్వీకరణకు ముగ్గురు అధికారులను నియమించినట్టు ఆయన తెలిపారు.
జన గణన దేశ వికాసానికి నాంది
డీఆర్‌ఓ సుబ్బారావు
అమలాపురం రూరల్: దేశ భవిష్యత్, ప్రణాళిక అధ్యయనానికి జన గణన అత్యంత కీలకమని డీఆర్వో వి.సుబ్బారావు తెలిపారు. మంగళవారం రాష్ట్ర జన గణన సంచాలకుడు జె.నివాస్ అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం డీఆర్‌ఓ మాట్లాడుతూ తొలి దశలో భాగంగా మే 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఇళ్ల జాబితా, గృహ గణన హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియ ముమ్మ రంగా సాగుతోందని తెలిపారు. స్వీయ గణనలో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఆన్‌లైన్ ద్వారా ప్రజలు నమోదు చేసుకున్న వివరాలను ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ధ్రువీకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కోనసీమ జిల్లా 79.47 శాతంతో ఏడో స్థానంలో నిలిచిందన్నారు.
మహిళా దొంగల
ఆచూకీ తెలపండి
జగ్గంపేట: జగ్గంపేట ఏరియాలో సంచరిస్తున్న మహిళా బ్యాగ్ దొంగలు ముఠా ఆచూకీ తెలిసిన వెంటనే ఆటో డ్రైవర్లు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. జగ్గంపేటలో స్థానికులు, ఆటో డ్రైవర్లకు ఆయన మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా దొంగలు ఆటోలో తిరుగుతూ బ్యాగ్‌లు చోరీ చేయడం, బస్‌లు ఎక్కేటప్పుడు, వెనక వుండి విలువైన వస్తువులు, హేండ్ బ్యాగ్‌లు చోరీ చేస్తున్నారని అన్నారు. ఒక ముఠా సభ్యులు ఈ నేరాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తమ వాహనాలను రోడ్లుపై నిలపాలని, నిబంధనలకు అనుగుణంగా అవసరమైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. ఆటోలో ప్రయాణించే వారి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. జగ్గంపేట సీఐ బి.తిరుపతిరావు, ఎస్సై రఘునాథరావు పాల్గొన్నారు.


