మళ్లీ చమురు వడ్డన | - | Sakshi
Sakshi News home page

మళ్లీ చమురు వడ్డన

May 20 2026 12:17 AM | Updated on May 20 2026 12:17 AM

లీటరుకు 95 పైసల చొప్పున పెంపు

జిల్లాలో రోజుకు 10.80 లక్షల లీటర్ల విక్రయాలు

రోజుకు రూ.10.20 లక్షల అదనపు భారం

సాక్షి, అమలాపురం: కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రో ధరలు పెంచింది. జిల్లాలో లీటరుకు 96 పైసల చొప్పున పెంచింది. గడిచిన వారం రోజులలో ధరల పెంపు ఇది రెండోసారి. దీంతో వినియోగదారులపై రోజుకు రూ.10.36 లక్షల అదనపు భారం పడనుంది. జిల్లాలో 115 వరకు పెట్రోల్‌, డీజిల్‌ బంకులు ఉండగా రోజుకు 6.8 లక్షల లీటర్ల పెట్రోల్‌, 4.80 లక్షల డీజిల్‌ చొప్పున విక్రయాలు సాగుతున్నాయి. ఈ పెంపుతో జిల్లాలో వినియోగదారులపై రూ.10.20 లక్షల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం పెట్రోలు లీటరు ధర రూ.112.26 ఉండగా, ఇది రూ.113.21కు పెరగనుంది. డీజిల్‌ లీటరు రూ.100.51 ఉండగా, ఇది రూ.101.46కు పెరిగింది. గత శుక్రవారం 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.3 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వాహనాల రవాణా చార్జీలు పెరుగుతాయని ఈ ప్రాంత రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement