ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట రేపు సీపీఐ ధర్నా
అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్న విధానాన్ని వ్యతిరేకిస్తూ గురువారం అమలాపురం రూరల్ మండలం కామనగరువు వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు ఉమ్మడి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కె.సత్తిబాబు తెలిపారు. అమలాపురం పట్టణం బండివారిపేట అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో మంగళవారం జరిగిన పార్టీ నియోజకవర్గ కమిటీ సమావేశానికి జిల్లా సమితి సభ్యుడు కురుచ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సత్తిబాబు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సీపీఐ శత వసంతాల సంబరాల ముగింపు సభ జనవరి 3న అమలాపురంలో జరుగుతుందని ప్రకటించారు. 2026 పార్టీ సభ్యత్వ రెన్యూవల్ ప్రక్రియ, ఈ నెల 23న పార్టీ జనరల్ బాడీ సమావేశం అమలాపురంలో నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. పార్టీ నియోజకవర్గ కార్యదర్శి గూడాల వెంకటరమణ, ఏఐటీయూసీ జిల్లా కమిటీ సభ్యుడు బి. గౌరీశంకర్ సమావేశంలో ప్రసంగించారు.


