బయోమెట్రిక్ అప్‌డేషన్ తప్పనిసరి
అమలాపురం రూరల్: జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలలో చదువుతున్న 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థుల ఆధార్ కార్డులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేషన్ చేయించుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. స్కూల్ ద్వారా నిర్వహించే ప్రత్యేక క్యాంపుల సేవలను విద్యార్థులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
ఇసుక అక్రమ రవాణా
బాట తొలగింపు
పి.గన్నవరం: మండలంలోని ఎల్.గన్నవరం శివారు నడిగాడి వద్ద వశిష్టా నదీ పాయ నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు అక్రమార్కులు బాటలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంగళవారం మైన్స్ ఆర్‌ఐ సుజాత ఆధ్వర్యంలో దాడి చేసి జేసీబీతో దానిని తొలగించారు. ర్యాంపు వద్ద గస్తీ నిర్వహించాలని వీఆర్వో కడలి వెంకటేశ్వరరావుకు మైన్స్ ఆర్‌ఐ సూచించారు. అంతకు ముందు పుచ్చల్లంక రేవును కూడా తనిఖీ చేశారు. అక్కడ లంకలో ఉన్న ఒక జేసీబీని సీజ్ చేసి, తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దాడుల్లో మైన్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఎండీ రెహ్మాన్ అలీ, సర్వేయర్ కె.శ్రీధర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా గుత్తుల
ముమ్మిడివరం: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా గాడిలంకకు చెందిన గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్టానం ఆయన పేరును ఖరారు చేసింది. సాయి గాడిలంక గ్రామ సర్పంచ్‌గా , 2000 సంవత్సరంలో ముమ్మిడివరం ఎంపీపీగా, 2005లో పి.గన్నవరం జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. 2009లో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెట్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్ సీసీ అభ్యర్థుగా పోటీ చేసి రెండు సార్లూ ఓటమి పొందారు. అనంతరం టీడీపీలో క్రీయాశీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు.
వినియోగదారులకు హక్కులపై
అవగాహన కల్పించాలి
జేసీ నిషాంతి
అమలాపురం రూరల్: వినియోగదారులకు తమ హక్కుల పట్ల, వాణిజ్య పద్ధతులపై అవగాహన కల్పించి ఆత్మవిశ్వాసంతో వినియోగించుకునేలా చేయడమే జాతీయ వినియోగదారుల వారోత్సవాల ప్రధాన లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో వినియోగదారుడు తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేసే సందర్భంలో దాని యొక్క విలువ మన్నిక తదితర అంశాలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని తమ హక్కులను సంపూర్ణంగా కాపాడుకోవాలన్నారు. జాతీయ విని యోగదారుల వారోత్సవాలు డిసెంబర్ 18 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించి వినియోగదారుల హక్కుల పట్ల సమగ్రమైన అవగాహనను అధికారులు కల్పించాలని ఆదేశించారు. 2025 ఇతివృత్తం ‘డిజిటల్ న్యాయ పాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం’గా నిర్దేశించారని, ఆ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి జయప్రదం చేయాలని సూచించారు. ప్రధానంగా జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాలకు రూ.5,000, రూ.3,000, రూ.2,000 నగదు, ప్రశంసా పత్రాలు బహుకరించాలన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ముందస్తు సమావేశాలు నిర్వహించి వారం రోజులపాటు కార్యక్రమాలను సమర్థంగా చేపట్టి వినియోగదారుల హక్కుల గురించి అవగాహన పెంపొందించాలన్నారు. జాగ్రత్త వినియోగదారుడే సురక్షిత వినియోగదారుడు అనే సందేశాన్ని సమాజ మంతా వ్యాపితం చేయాలన్నారు. వినియోగదారుల హక్కులపై ప్రచారం, న్యాయ పరిరక్షణ మార్గాలపై మార్గ నిర్దేశం చేయాలన్నారు. హెల్ప్‌లైన్ 1915 వినియోగించి హక్కుల పరిరక్షణ దిశగా ముందుకు సాగాలన్నారు. హక్కుల పట్ల సమగ్రమైన అవగాహనను అధికారులు కల్పించాలని ఆదేశించారు. 2025 ఇతివృత్తం ‘డిజిటల్ న్యాయ పాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం’గా నిర్దేశించారని, ఆ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాలకు రూ.5,000, రూ.3,000, రూ.2,000 నగదు బహూకరించాలన్నారు.
బయోమెట్రిక్ అప్‌డేషన్ తప్పనిసరి


