గొల్లపల్లికి జగన్ పరామర్శ
● ఫోన్‌లో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి
● పార్టీ అండగా ఉంటుందని భరోసా
మలికిపురం: గుండెకు ఆపరేషన్ చేయించుకుని అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాజోలు కో ఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావును శుక్రవారం మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సూర్యారావు కుమారుడు గొల్లపల్లి శ్రీధర్‌తో కూడా జగన్ ఫోన్‌లో మాట్లాడి, ధైర్యం చెప్పారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, రాష్ట్ర సోషల్ మీడి యా కార్యదర్శి నేతల నాని, తాడి సహదేవ్, దొంగ నాగ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
శాస్త్రోక్తంగా శిఖర సంప్రోక్షణ
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయంలో శుక్రవారం శిఖర సంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిగింది. ప్రత్యేక పూజల నడుమ ఈ కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. మోంథా తుపానుకు ఆలయ పైభాగంలోని ఒక శిఖరం కిందకు పడి పోయింది. దీంతో మూడు శిఖరాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త శిఖరాలను సంప్రోక్షణ చేశారు. ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
గొల్లపల్లికి జగన్ పరామర్శ


