మైగ్రేషన్ కేంద్రం సేవలు వినియోగించుకోవాలి
రావులపాడు స్టాక్ పాయింట్ వద్ద ఇసుక ఎగుమతులు
రావులపాలెం మండలం రావులపాడు స్టాక్ పాయింట్ వద్ద సగం ఖాళీ అయిన ఇసుక
అమలాపురం రూరల్: విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారందరూ అధికారిక వలసదారుల గైడెన్స్ కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఆయనను శుక్రవారం ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేన్స్ అధికార ప్రతినిధి ఆనంద దేవులపల్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ విదేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలనుకునే వారికి మార్గనిర్దేశం చేసేందుకు కలెక్టరేట్‌లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కేంద్రాన్ని అధికారికంగా నలుగురు సిబ్బందితో డీఆర్‌ఓ నోడల్ అధికారిగా నెలకొల్పడం జరిగిందన్నారు. దీని ద్వారా వివిధ దేశాలలో లభ్యమయ్యే ఉద్యోగ అవకాశాలు, అర్హతలు, వేతన వసతుల వివరాలు అందిస్తారన్నారు. ఉద్యోగ రిక్రూట్ మెంట్లు, ప్రత్యక్ష ఎంపికలు, వీసా సూచన , ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్లపై అవగాహన కల్పిస్తారన్నారు.
● కొబ్బరి ముడి సరుకు ఆధారిత జియో టెక్స్‌టైల్స్, మ్యాట్ల తయారీ కంపెనీ స్థాపనకు ప్రతిపాదనలు రూపొందించాలని క్వాయర్ బోర్డు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకర్లు, క్వాయర్ బోర్డు అధికారులు, అంబాజీపేట మండలం మాచవరం రాజరాజేశ్వరి క్వాయర్ ఇండస్ట్రీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జియో టెక్స్‌టైల్స్ మ్యాట్లు సహజ, బయో డిగ్రేడబుల్, పర్యావరణ హితమైన వస్తువుల ను మట్టి సుడుల నివారణ, స్లోప్ ప్రొటెక్షన్, రోడ్డు, పంటల కాలువల పటిష్టత కోసం వినియోగిస్తారన్నారు. ఫైబర్‌ను ప్రధానంగా 100 శాతం సహజ పదార్థంగా ఉపయోగించి, మ్యాట్లను తయారు చేస్తారన్నారు. మాచవరం రాజరాజేశ్వరి క్వాయర్ ఇండస్ట్రీలో జియో టెక్స్‌టైల్స్ మ్యాట్ల తయారీ పరిశ్రమ స్థాపనకు యోచన చేస్తున్నట్లు వెల్లడించారు.
● మోంథా తుపాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని స్పష్టంగా తెలిపే నివేదికలతో ఈనెల 8న కలెక్టరేట్‌లో జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి రావాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక, మార్కెటింగ్ తదితర శాఖలకు సంబంధించి ప్రధాన సమీక్ష జరుగుతుందన్నారు.
మైగ్రేషన్ కేంద్రం సేవలు వినియోగించుకోవాలి


