రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్‌లో మణికంఠకు కాంస్య పతకం
అంబాజీపేట: రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో గంగలకుర్రు అగ్రహారం జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న బొక్కా సత్యశివశ్రీసాయి మణికంఠ తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం సాధించాడని హెచ్‌ఎం అక్కిరాజు శేషసాయి, పీడీ ఆసు వెంకట సూర్యమథు తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్ 19 విభాగంలో మణికంఠ తృతీయ స్థానం సాధించాడన్నారు. తనతో పాటు అండర్ – 17లో చొల్లంగి జాహ్నవిశివదుర్గ, అండర్ –17, 19 విభాగాల్లో పంటపాటి నాగశ్రీదుర్గ, సాదా నిఖితదేవి పాల్గొన్నారన్నారు.


