సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి
అమలాపురం రూరల్: జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. గురువారం అమలాపురం కలెక్టరేట్‌లో ఏపీ ఈపీడీసీఎల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంకు ప్రతినిధులు మున్సిపల్ అధికారులు, సోలార్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు విధి విధానాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పురపాలక సంఘాల భవనాలు, వీధి దీపాలు, నీటి పంపులు, శానిటేషన్ ప్లాంట్లు తదితర చోట్ల ఎక్కువగా విద్యుత్ వినియోగించే అవకాశం ఉందన్నారు. అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేయవచ్చని అన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ బి.రాజేశ్వరి, లీడ్ బ్యాంకు ఎల్‌డీఎం ఎం.కేశవవర్మ తదితరులు పాల్గొన్నారు.
ఫ విద్యార్థులకు క్రీడా పోటీల నిర్వహణకు సమయపాలన కల్పించాలని మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో కోనసీమ క్రీడోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ క్రీడా కమిటీలను వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థి ప్రతినిధులను కలిపి ఏర్పాటు చేయాలన్నారు. జేసీ టి.నిషాంతి, డీఈఓ సలీం బాషా, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, స్కూల్ గేమ్స్ కార్యదర్శులు ఈశ్వరరావు రమాదేవి పాల్గొన్నారు.
పశువుల పెంపకంపై అవగాహన
పాడి పశువుల పెంపకంపై గ్రామ సచివాలయాల పశు సంవర్ధక సహాయకులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈదరపల్లిలోని పశుసంవర్ధక శాఖ శిక్షణ కార్యాలయంలో గురువారం నుంచి 25వ తేదీ వరకూ జరిగే ఏహెచ్‌ఏల శిక్షణను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంచుకుని జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించాలన్నారు.
ఫ జిల్లాలో పాడి పశువుల ఉత్తమ పోషణ ద్వారా పాల దిగుబడి పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని పాడి రైతులు, వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాల (ఫ్యాక్స్) అధ్యక్షులు, కార్యదర్శులు, పశుగ్రాస దాణా ఉత్పత్తిదారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పశువుల సంతతి మెరుగుదల, గర్భధారణ, పాల దిగుబడి పెంచేలా టోటల్ మిక్సర్ దాణా తక్కువ ధరకు అందించే చర్యలపై సమీక్షించారు.
కలెక్టర్ మహేష్ కుమార్


