‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను ప్రచురిస్తున్నందుకు ఎడిటర్‌తో పాటు విలేకర్లపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తే సంబంధిత శాఖ అధికారులు వివరణ ఇవ్వాలి. అంతే కానీ ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో పత్రిక ఎడిటర్‌ను, విలేకర్లను వేధించడం సరికాదు.
– తోట నరసింహం, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్
కక్ష సాధింపు తగదు
‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వానికి తగదు. ఆ పత్రిక విలేకర్లపై అక్రమ కేసులు నమోదు చేయడం ఖండనీయం. ప్రతిపక్షంపై బాబు వైఖరి, మీడియాతో వ్యవహరిస్తున్న తీరు సమర్థనీయం కాదు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న ‘సాక్షి’ మీడియాను అణచి వేయడం ఆమోదం యోగ్యం కాదు. ఇలాంటి అరాచక పాలనకు బాబు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
– గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్
కావాలనే వేధిస్తున్నారు
కావాలనే వేధిస్తున్నారు


