నకిలీ మందుపాతరేద్దాం | - | Sakshi
Sakshi News home page

నకిలీ మందుపాతరేద్దాం

Oct 14 2025 7:19 AM | Updated on Oct 14 2025 7:19 AM

నకిలీ మందుపాతరేద్దాం

నకిలీ మందుపాతరేద్దాం

సాక్షి, అమలాపురం: ధన దాహంతో కూటమి నేతలు ఏరులై పారిస్తున్న నకిలీ మద్యానికి ఎన్నో పేద కుటుంబాలు బలవుతున్నాయి.. సర్కారు ఖజానా నింపుకొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న తప్పిదానికి ఓట్లు వేసి గెలిపించిన మహిళల బతుకులు ఎగతాళి అవుతున్నాయి. ఈ పరిస్థితులు చూసి విసిగిపోతున్న జనానికి వైఎస్సార్‌ సీపీ కొండంత అండగా నిలిచింది.. నకిలీ మద్యంపై సోమవారం పోరుబాటకు దిగింది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న ‘పచ్చ’ తోడేళ్లను శిక్షించాలని నినాదాలు చేసింది. నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రణభేరి మోగించింది. ప్రజల తరఫున వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, మహిళలు రోడ్డెక్కి కదం తొక్కారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఎకై ్సజ్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి, తయారీదారులను కఠినంగా శిక్షించాలని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తెల్లవారు జాము నుంచి కురుస్తున్న వర్షం వైఎస్సార్‌ సీపీ శ్రేణుల కదనోత్సాహానికి చిన్నబోయింది. వానను సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి, నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలిచారు. పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల విభాగాల, అనుబంధ సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ ఆందోళనలో పాలుపంచుకున్నారు.

అమలాపురం నియోజకవర్గంలో..

నకిలీ మద్యానికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రం అమలాపురంలో వైఎస్సార్‌ సీపీ ఆందోళన చేపట్టింది. భట్నవిల్లిలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ నివాసం నుంచి ఎకై ్సజ్‌ కార్యాలయం వరకూ శ్రేణులు పాదయాత్ర చేశారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పినిపే శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్‌, కుడుపూడి సూర్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నకిలీ మద్యా న్ని అరికట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎకై ్సజ్‌ కార్యాలయంలో సీఐ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), పార్టీ ఎస్‌ఈసీ సభ్యులు కుడుపూడి వెంకటేశ్వరరావు (బాబు), కాశి బాల మునికుమారి, కుడుపూడి భరత్‌ భూషణ్‌, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, బీసీ సెల్‌ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరిజాకుమారి, బూత్‌ కమిటీ అధ్యక్షుడు చీకట్ల కిషోర్‌ పాల్గొన్నారు.

సర్కారు మద్యం విధానంపై

వైఎస్సార్‌ సీపీ కన్నెర్ర

పోరుబాటకు దిగిన పార్టీ శ్రేణులు

వర్షాన్నీ లెక్క చేయకుండా నిరసనలు

ఎకై ్సజ్‌ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు

పి.గన్నవరం..

పి.గన్నవరంలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు ఈ ర్యాలీలో పాల్గొని నకిలీ మద్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గన్నవరంలోని నియోజకవర్గం పార్టీ కార్యాలయం నుంచి మూడు రోడ్ల జంక్షన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అక్కడ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరిగి అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ పాదయాత్ర చేశారు. తహసీల్దార్‌ పి.శ్రీపల్లవికి వినతిపత్రం అందించారు. పార్టీ కో ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి పాల్గొన్నారు.

రామచంద్రపురం..

నకిలీ మద్యానికి వ్యతిరేకంగా రామచంద్రపురంలో నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, మహిళలు నకిలీ మద్యానికి వ్యతిరేకంగా నినదించారు. పట్టణంలో పార్టీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్‌ కార్యాలయం వరకూ భారీ పాదయాత్ర నిర్వహించారు. నకిలీ మద్యం అరికట్టాలని, దోషులను శిక్షించాలని నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు చింతలపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement