
వైఎస్సార్ సీపీలో యువతదే కీలక పాత్ర
మలికిపురం: వైస్సార్ సీపీలో యువతదే కీలక పాత్ర అని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పిల్లి సూర్య ప్రకాష్ అన్నారు. నియోజకవర్గ యువజన విభాగం సమావేశం శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆ విభాగం అధ్యక్షుడు గుర్రం జాషువా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సూర్యప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌హన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యువజన విభాగాలను అన్ని విధాలా బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. గ్రామాలలో సైతం పార్టీ యువత క్రియాశీలకంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు అండగా నివాలని సూచించారు. అధికార పార్టీ వేధిస్తే తీవ్రంగా ప్రతిఘటించేందుకు పార్టీ యంత్రాంగం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య కుమార్ మాట్లాడుతూ పార్టీ అధినేత ఆదేశాలను పాటించేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందన్నారు. పార్టీ అన్ని యువజన విభాగాల పదవులను భర్తీ చేశామని పేర్కొన్నారు. జిల్లా యువజన విభాగం నాయకులు బొంతు రమేష్, కొంబత్తుల మున్నా, బాబూరావు, నల్లి సుధీర్, మండల స్థాయి యువజన విభాగాల అధ్యక్షులు ఏగడెల చిట్టిబాబు, కొప్పిశెట్టి రాము, వాసంశెట్టి శ్రీహరి, ఉచ్చుల మోహన్, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు తాడి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ యువజన విభాగం
జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్