
మందుల దుకాణాల్లో తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో మత్తు, వయాగ్రా మందుల అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 80 మందుల దుకాణాలకు పైగా తనిఖీ చేసినట్లు డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. దుళ్లలోని శ్రీశ్రీనివాస మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, శ్రీ మెడికల్స్‌లో డ్రగ్స్ అధికారులు దాడులు చేయగా అక్కడ ఫార్మాసిస్ట్ లేకపోవడం, బిల్లులు లేకుండా అమ్మకాలు చేయడం, షెడ్యూల్ రిజిస్టర్ సరిగా లేకపోవడం, కాలం చెల్లిన మందులు లభించడం కనుగొన్నామన్నారు. వీటితో పాటు మరికొన్ని దుకాణాలు ఇదే విధంగా ఉన్నాయని, వాటన్నింటిపై కేసులు నమోదు చేశామన్నారు.