
నిడదవోలులో చోరీ
నిడదవోలు: పట్టణంలోని సంజీవయ్యనగర్‌లో సోమవారం రాత్రి దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. గొట్టుముక్కల నాగేశ్వరరావు తన కుటంబ సభ్యులతో ఈ నెల 19న హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి ఇంటికి వచ్చాక చోరీ జరిగినట్లు గుర్తించారు. దుండగులు ముందుగా ప్రధాన ద్వారానికి వేసిన తాళం పెకిలించి ఇంట్లోకి ప్రవేశించారు. గదిలో బీరువా తెరచి లాకర్‌లో దాచుకున్న రెండు కాసుల బంగారు వస్తువులు, రూ.లక్ష నగదును అపహరించారు. ఇంటి యజమాని నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.