
బ్రాండ్ బాజా!
జిల్లా పేరు మద్యం గీత కార్మికుల మొత్తం
దుకాణాలు షాపులు
కోనసీమ 133 13 146
తూర్పు గోదావరి 125 12 137
కాకినాడ 155 15 170
● బ్రూవరీస్ కార్పొరేషన్ నిర్వాకం
● బ్రాండు ఒకటే.. ధరలే వేరు
● మద్యం వ్యాపారుల సరికొత్త దోపిడీ
● అందుబాటులో లేని రూ.99 మద్యం
ఆలమూరు: బ్రూవరీస్ కార్పొరేషన్ చేస్తున్న మద్యం సరఫరా, ధరల నిర్ధారణ ఒక ప్రహసనంలా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అండతో మద్యం సిండికేట్లు కుమ్మకై ్క మద్యం ప్రియుల బలహీనతలను ఆసరాగా తీసుకుని వారిని అనేక రూపాల్లో దోచుకుంటున్నారు. ఒకే మద్యం బ్రాండును ఒకే ధరకు విక్రయించవలసి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. బ్రాండు ఒకటే అయినా ధర మాత్రం వేర్వేరుగా ముద్రించి వసూలు చేయడం ద్వారా ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోంది. దీంతో మద్యం కొనుగోలుదారుల్లో మద్యం ధరలపై అయోమయం నెలకొంటోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనున్న 453 మద్యం దుకాణాలకు అమలాపురం, రాజమహేంద్రవరం, సామర్లకోట బ్రూవరీస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం సరఫరా జరుగుతుంది. మద్యం షాపుల స్థాయిని బట్టి 20 నుంచి 30 రకాల చీప్ లిక్కర్ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకూ అందుబాటులో ఉంటున్నాయి.
ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో చీప్ లిక్కర్ బ్రాండు అయిన 9 సీ హార్స్ కంపెనీ క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.120గా ఉంది. అయితే గత ఏడాది నవంబర్‌లో తయారు చేసిన 179 బ్యాచ్ బాటిళ్లలో మూడు ఎంఆర్‌పీ ధరలు ఉండటం వినియోగదారులను నివ్వెర పరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.99 ధర కలిగిన మద్యం బాటిళ్లు ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ చీప్ లిక్కర్‌ను ఐదు కంపెనీలు సరఫరా చేస్తున్నా పూర్తిస్థాయిలో మద్యం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండటం లేదు.
ఇదో రకం దోపిడీ
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల వద్ద ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ముద్రించి దోచుకుంటున్నారని మద్యం కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. 9సీ హార్స్ బ్రాండుకు చెందిన క్వార్టర్ బాటిల్ ధర రూ.120గా ఉంది. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మద్యం షాపుల్లో ఒక్కొక్క చోట ఒక్కొ విధంగా రూ.120. రూ.130, రూ.140 ధరలు ముద్రించి ఉన్నట్లు బాటిళ్లను చూస్తే తెలుస్తోంది. ఈ ధరలు మద్యం విక్రయదారులు ముద్రించారా లేదా బ్రూవరీస్ కార్పొరేషన్ ముద్రించి అమ్మకాలు కొనసాగిస్తోందా అనే సందేహం కలుగుతోంది. ఈ ధరల తేడా వల్ల మద్యం కొనుగోలుదారులు సుమారు రూ.ఐదు లక్షల వరకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. చీప్ లిక్కర్ ధరలను ప్రాంతానికి ఒక్కో విధంగా నిర్ణయించి ప్రజలతో చెలగాటం ఆడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం దుకాణాల వద్ద విధిగా ఏర్పాటు చేయాల్సిన మద్యం ధరల పట్టిక కాని, స్టాకు వివరాలు కాని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఏర్పాటు చేయకపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఎంఆర్‌పీలో తేడా ప్రస్తుతం ఒక బ్రాండు కేనా మిగిలిన బ్రాండులపై కూడా తేడాగా ముద్రిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.
కనిపించని రూ.99 మద్యం
మద్యం షాపుల్లో పేదలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన మద్యాన్ని రూ.99 కే విక్రయిస్తామన్న కూటమి నాయకుల ఎన్నికల హామీ బుట్టదాఖలైంది. బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి రేషన్ పద్ధతిలో వారానికి దుకాణానికి మూడు మద్యం కేసులకు మించి సరఫరా చేయడం లేదని తెలుస్తోంది. అలాగే రూ.99 మద్యం బాటిల్‌కు కమీషన్‌ను పూర్తిగా తగ్గించడంతో విక్రయదారులు కూడా ఆ బ్రాండ్లను అమ్మడానికి ఇష్టపడటం లేదని మద్యం ప్రియులు చెబుతున్నారు.

బ్రాండ్ బాజా!

బ్రాండ్ బాజా!