ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు | - | Sakshi
Sakshi News home page

ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు

Jul 17 2025 3:20 AM | Updated on Jul 17 2025 3:20 AM

ఖాతాక

ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆధునిక కాలంలో రూపాయి నుంచి ఎంత పెద్ద మొత్తమైనా డిజిటల్‌ లావాదేవీలే సాగుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రతి రూపాయి లబ్ధిదారు ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఏదైనా తేడా జరిగినా తప్పు ఎక్కడ జరిగిందనేది సులభంగా తెలుసుకునే వీలుంటుంది. ఉదాహరణకు తల్లికి వందనం వంటి పథకాలు చాలా మందికి చేరలేదు. వీటిలో ఖాతా వినియోగంలో లేదంటూ సగటున ప్రతి సచివాలయానికి వంద నుంచి 150 వరకూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ–కేవైసీ లేకపోవడం వల్ల జిల్లాలో దాదాపు రూ.2 కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాకు చేరలేదు. దీంతో వారంతా సచివాలయాల చూట్టు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం లేకపోవడంతో ఖాతాలు యాక్టివ్‌గా లేవని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నివేదికలో ఉంది. గత ఏడాది నవంబర్‌లో 2,74,488 ఖాతాలు యాక్టివ్‌గా లేవని సచివాలయాల వారీగా విభజించి ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో లబ్ధిదారుల ఖాతాలను ప్రదర్శించారు. దీంతో పోస్టల్‌, బ్యాంకింగ్‌ రంగాలు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టగా దాదాపు లక్ష ఖాతాల వరకూ మాత్రమే యాక్టివేట్‌ చేసుకున్నారు. దీని ప్రకారం ఖాతాదారులందరూ వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకునేలా ఆయా సచివాలయాల పరిధిలో సిబ్బంది ప్రోత్సహించాల్సి ఉంది. ఖాతాలు లేకపోతే జాతీయ బ్యాంకుల్లోగాని, తపాలా కార్యాలయాల్లో కానీ పొదుపు ఖాతాలు తెరవాల్సి ఉంది. అనంతరం సచివాలయ సిబ్బందికి ఇచ్చిన యాప్‌లో ఆయా ఖాతాలను ఎన్‌పీసీఐ నిబందనల ప్రకారం అప్‌డేట్‌ చేస్తారు.

ఖాతాలు బతికించాలి

ప్రభుత్వం నుంచి మంజురయ్యే ఏ సంక్షేమ పథఽకమైన లబ్ధిదారులకు నేరుగా అందాలంటే బ్యాంక్‌ ఖాతా బతికి ఉండాలి. కొందరికి రెండుమూడు ఖాతాలు ఉండి వాటిలో వినియోగంలో లేకపోవడం సమస్యలకు దారి తీస్తొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని గుర్తించి అర్హులకు సంక్షేమ పథకాలు చేరవేయడానికి ప్రతి బ్యాంక్‌ ఖాతాను లైవ్‌లో ఉంచాలని భావిస్తోంది. వీలైనంత డిజిటల్‌ లావాదేవీలు జరిగేలా ప్రొత్సహించింది. దీంతో ప్రతిపైసాకు లెక్క ఉంటుందనే ప్రధాన ఉద్దేశం. అలా జరిగినప్పుడే 18 ఏళ్లు నిండిన లబ్ధిదారుల ఖాతాలకు నవశకం బెనిపిషరీ మేనేజ్‌మెంట్‌ పోర్టల్లో ప్రభుత్వం విడుదలచేసే సంక్షేమ నిధులు కచ్చితంగా అందుతాయనే భావనతో ప్రభుత్వం ఉంది.

తపాలాశాఖ ప్రత్యేక డ్రైవ్‌

నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) మ్యాపింగ్‌లో ఆధార్‌ అనుసంధానం లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని నేపథ్యంలో పోస్టల్‌ శాఖ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. కేవలం రూ.200 తో గ్రామ స్థాయిలో వారి ఇంటి వద్దే ఖాతా ప్రారంభిస్తుంది.

నిరర్ధక ఖాతాలు

ఎన్నున్నా నిరుపయోగమే

జిల్లాలో నిర్జీవంగా

ఉన్న ఖాతాలు 1,76,500

అవి పునరుద్ధరిస్తేనే ప్రభుత్వ పథకాలు

ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టిన పోస్టల్‌ శాఖ

అధిక ఖాతాలతో ఇబ్బందులు

కొందరికి రెండు, మూడు ఖాతాలు ఉండి వాటిలో ఏదో ఒక ఖాతా మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు వినియోగంలో లేని ఖాతా నెంబర్‌ ఇవ్వడంతో సమస్యగా మారింది. ప్రతి లబ్ధిదారు ఖాతాను సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మూసేసుకోవాలి. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

– చందాల శ్రీవెంకట ప్రసాద్‌, ఎల్‌డీఏం కాకినాడ జిల్లా

ప్రతి తపాలా కార్యాలయం ద్వారా ఐపీపీబీ ఖాతాలు

ప్రతి తపాలా కార్యాలయంలో ఐపీపీబీ ఖాతాలు ప్రారంభించి ఆధార్‌ అనుసంధానం చేస్తున్నాం. కాకినాడ డివిజన్‌లో ఉన్న కాకినాడ, సామర్లకోట ప్రధాన తపాలా కార్యాలయంతో పాటు 54 ఉప తపాలా కార్యాలయాలు, 283 శాఖలలో సేవలు సద్వినియోగం చేసుకోవాలి. – దాసరి నాగేశ్వరరెడ్డి, ఇన్‌చార్జి పోస్టల్‌ సూపరిండెంట్‌, కాకినాడ

ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు1
1/2

ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు

ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు2
2/2

ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement