
యువతకు ఆసరా.. ఉపాధికి భరోసా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్‌టీసీ) అంటే ముందుగా గుర్తుకువచ్చేది సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం. ఏపీఎస్ ఆర్‌టీసీ ప్రయాణికుల సేవలో కాకుండా నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. ఆసక్తి గలవారికి హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. 2020వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగ యువత భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు వీటిని ప్రారంభించారు.
వాహన చట్టాలపై అవగాహన
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆర్టీసీ హెవీ వెహికల్‌లో డ్రైవింగ్ పాఠశాలలు ప్రారంభించింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ ఆర్‌టీసీ కాంప్లెక్స్‌లో హెవీ డ్రైవింగ్ శిక్షణ కార్యాలయం ఏర్పాటు చేసి యువతీ యువకులను బ్యాచ్‌లుగా ఏర్పాటు చేసి డ్రైవింగ్‌లో శిక్షణ, వాహన చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీనికోసం నామమాత్రపు ఫీజు నిర్ణయించారు. శిక్షణ పూర్తి చేసేవారికి సర్టిఫికెట్‌తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి వారి జీవితానికి భరోసా కల్పిస్తున్నారు. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటున్న అభ్యర్థులు భవిష్యత్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో డ్రైవర్లుగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో అయితే ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ 19 బ్యాచ్‌లలో 305 మంది శిక్షణ పొందారు. నిరుద్యోగ యువతకు భవిష్యత్ కల్పించడం, డ్రైవింగ్‌లో మెళకువలు నేర్పించడం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
21వ బ్యాచ్‌కు
దరఖాస్తుల ఆహ్వానం
హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో అభ్యర్థులకు సుశిక్షితులైన నిపుణులతో శిక్షణ అందిస్తున్నాం. రాత్రివేళ్లలో డ్రైవింగ్ నేర్పిస్తాం. సమయ పాలన ,క్రమశిక్షణ, అంకితభావంతో డ్రైవింగ్‌లో మెళుకువలు నేర్పుతూ రోజూ తరగతి గదిలో పాఠాలతో పాటు గ్యారేజీలో ఇంజిన్ భాగాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఘాట్‌రోడ్డు ఎత్తు, పల్లం వంటి ప్రాంతాలలో ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం 21వ బ్యాచ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం.
– కే.డీ.ఎం.రాజు డ్రైవింగ్ స్కూల్ ఇన్‌స్పెక్టర్
ఆర్‌టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ
నిరుద్యోగులకు అండగా ఏపీఎస్ ఆర్‌టీసీ
ఐదేళ్ల కాలంలో 305 మందికి తర్ఫీదు
సుశిక్షితులైన నిపుణులతో నిర్వహణ
21 బ్యాచ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
హెవీ లైసెన్స్‌కు శిక్షణ
జేఎన్‌టీయూకేలో బీటెక్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్నాను. భవిష్యత్‌లో కొన్ని ఉద్యోగాలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడిగే అవకాఽశం ఉంది. శిక్షణతో పాటు లైసెన్స్, డ్రైవింగ్‌కు సంబంధించి అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.
– ఎం.జోష్, కాకినాడ
డ్రైవింగ్‌పై అవగాహన వచ్చింది
కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకు సంబంధించి డిఫెన్స్ వంటి వాటికి హెవీ లైసెన్స్ తప్పనిసరిగా అడుగుతున్నారు. డ్రైవింగ్‌తో పాటు లైసెన్స్ జారీకు ఆర్‌టీసీ అందిస్తున్న సేవలు వినియోగించుకున్నాను. ఇటువంటి వాటి ద్వారా నేర్చుకుంటే అవగాహన పూర్తిగా వస్తుంది. – పి.బాలురెడ్డి, పీఆర్ డిగ్రీ కళాశాల

యువతకు ఆసరా.. ఉపాధికి భరోసా

యువతకు ఆసరా.. ఉపాధికి భరోసా

యువతకు ఆసరా.. ఉపాధికి భరోసా

యువతకు ఆసరా.. ఉపాధికి భరోసా