
3న జాతీయ చదరంగం పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ చదరంగం టోర్నమెంట్‌ను కాల్ ఫ్యూజన్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆగస్టు 3న నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ విత్తనాల హైమావతి తెలిపారు. మంగళవారం టోర్నమెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ లోరియల్ హై గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో రూ.1,23,456 నగదు బహుమతితో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి సుమారు 400 మంది వరకు చదరంగ క్రీడాకారులు హాజరవుతారన్నారు. విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలను అందజేస్తామన్నారు. స్కూల్ డైరెక్టర్ సుంకర రవికుమార్, ప్రిన్సిపాల్ ఏక్తా, టోర్నమెంట్ డైరెక్టర్ హైమావతి, చెస్ అకాడమీ డైరెక్టర్ విత్తనాలకుమార్ పాల్గొన్నారు.