
అక్కాచెల్లెళ్ల అదృశ్యం
కడియం: స్థానికంగా ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వస్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు పి.వీరనాగవల్లి, పి.పద్మప్రియ అదృశ్యమైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. కడియం పోలీస్ ఇన్‌స్పెక్టర్ అల్లు వేంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 10, 9 తరగతులు చదువుకున్న వీరిద్దరు ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. మంగళవారం కావడంతో ఆంజనేయస్వామి గుడికని వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరి ఆచూకీ తెలిస్తే కడియం పోలీస్ స్టేషన్ 9440796587, 9347705890 నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.