
ఆస్పత్రికి వెళుతూ మృత్యు ఒడికి..
● బైక్ ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్
● భార్య మృతి
● భర్త, పిల్లలకు గాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లోని పటవల జంక్షన్ వద్ద మంగళవారం ఆయిల్ ట్యాంకర్ ఢీకొని దడాల ఝాన్సీలక్ష్మి (28) మృతి చెందింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు ఇంజరం గ్రామానికి చెందిన దడాల శేఖర్ తన భార్య ఝాన్సీలక్ష్మి, ఇద్దరు కుమారులను తీసుకుని కాకినాడ ఆస్పత్రికి వెళుతుండగా ఆయిల్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఝాన్సీలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, శేఖర్, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. పటవల గ్రామ పంచాయతీ మహిళా పోలీసు కోరంగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య మృతదేహం వద్ద శేఖర్ బోరున విలపించడం అక్కడివారిని కలచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.