
760 టన్నుల ఇసుక అక్రమ నిల్వ స్వాధీనం
రాజానగరం: మండలంలోని దివాన్‌చెరువు, బీజాపురి టౌన్‌షిప్‌లో రోడ్లపై అక్రమంగా నిల్వ చేసిన గోదావరి ఇసుకను వాహనాలతో సహా టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు మనీషా, శైలజ, ఎస్సై ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడి చేసి రెండు చోట్ల నిల్వ చేసిన 760 టన్నుల ఇసుకను, అదే సమయంలో అక్కడకు అర టన్నులోడుతో వచ్చిన లారీని సీజ్ చేశారు. కాగా ఇసుక రవాణా బిల్లు ఉదయం తీసుకున్నప్పటికీ దానితోనే రోజంతా వీలైనన్ని ట్రిప్పులు వేస్తున్నట్టు గుర్తించారు. ఇసుక అక్రమ నిల్వలపై ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా మైనింగ్ అధికారి డి. ఫణిభూషణ్‌రెడ్డి తెలిపారు.