కోనసీమ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
కొత్తపేట: జేఈఈ అడ్వాన్స్‌డ్–2025లో కోనసీమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఓపెన్ కేటగిరీ ఆలిండియా స్థాయిలో తమ సత్తా చాటారు.
భరద్వాజ్‌కు ఆలిండియా 82 ర్యాంక్
కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు గొలకోటివారిపాలెం గ్రామానికి చెందిన తోరాటి భరద్వాజ్ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఓపెన్ కేటగిరీ ఆలిండియా స్థాయిలో 82వ ర్యాంక్‌ను, ఈడబ్ల్యూఎస్‌లో ఐదో ర్యాంకు సాధించాడు. గ్రామీణ వ్యవసాయ కుటుంబానికి చెందిన తోరాటి శివ, పుష్ప దంపతుల కుమారుడైన భరద్వాజ్ పదో తరగతి వరకూ అమలాపురం, ఇంటర్మీడియెట్ విజయవాడలో చదివాడు. ముంబై ఐఐటీలో సీఎస్‌ఈ సీటు సాధించి కంప్యూటర్ ఇంజినీర్ కావడమే తన లక్ష్యమని భరద్వాజ్ తెలిపాడు.
మణిదీప్‌వర్మకు ఆలిండియా 386
ఆత్రేయపురం గ్రామానికి చెందిన ముదునూరి మణిదీప్‌వర్మ జేఈఈ అడ్వాన్స్ ఓపెన్ కేటగిరీ ఆలిండియా స్థాయిలో 386 ర్యాంక్‌ను, ఈడబ్ల్యూఎస్‌లో 21 ర్యాంకు సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ముదునూరి శ్రీనివాసరాజు, మాధవీ ఝాన్సీ దంపతుల కుమారుడైన మణదీప్‌వర్మ రాజమహేంద్రవరం, విజయవాడల్లో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ముంబై ఐఐటీలో సీఎస్‌ఈ సీటు సాధిస్తానని భరద్వాజ్ తెలిపాడు. కంప్యూటర్ ఇంజినీర్ కావడమే తన లక్ష్యమన్నాడు.
కోనసీమ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు


