మాల మహానాడు జేఏసీ నాయకుల అరెస్ట్
పామర్రు పోలీస్ స్టేషన్‌కు తరలింపు
ముమ్మిడివరం: నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం వచ్చిన సీఎం చంద్రబాబుకు ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరిగిందని తెలపాలని మాల మహానాడు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాల మహానాడు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం రూరల్, క్రైమ్ సీఐల ఆధ్వర్యంలో శనివారం ఉదయం బందరుపాలెం సమీపంలో కర్రివానిరేవుకు చెందిన జేఏసీ నాయకుడు కాశి జగపతిరావు, ఎదుర్లంక గ్రామానికి చెందిన దుక్కిపాటి సత్యనారాయణ, ముమ్మిడివరానికి చెందిన దేవరపల్లి ఏడుకొండలు, మెండి కృష్ణబాబు, ఉచ్చుల సాల్మన్‌రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పామర్రు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జేఏసీ నాయకులతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా నాయకురాలు కాశి బాలమునికుమారిని ముమ్మిడివరం బాలయోగి ఆశ్రమం వద్ద గృహ నిర్బంధం చేశారు.అలాగే కాట్రేనికోనకు చెందిన వడ్డి శ్యాంప్రసాద్, గల్లా రాజేందర్‌లను గృహ నిర్బంధం చేశారు. శనివారం రాత్రి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌కు జేఏసీ నాయకులను తీసుకు వచ్చి అప్పగించారు.
మాల మహానాడు జేఏసీ నాయకుల అరెస్ట్


