
జగన్‌కు వరి కంకులను బహూకరించిన రైతు
రావులపాలెం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అఽధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక రైతు తాను పండించిన వరి కంకులను బహూకరించారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల నాయకులు, రైతులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లికి చెందిన రైతు మెర్ల సత్యనారాయణ తాను పండించిన వరి కంకులను జగన్‌కు బహూకరించారు. ప్రస్తుతం అన్నదాత పడుతున్న ఇబ్బందులను, రైతుల గోడును జగన్‌కు వివరించారు. అన్నదాతకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కొత్తపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు.