
కోర్టుకు వెళ్లామని ఇబ్బంది
చెరువును 40 ఏళ్ల నుంచి కుల వృత్తికి వినియోగించుకుంటున్నాం. పంచాయతీ నుంచి లీజుకి తీసుకున్నాం. చెరువు గట్టు ఆక్రమణలు తొలగించాలని హైకోర్టుకు వెళ్లాం. కోర్టు ఆదేశించినా ఆక్రమణలు తొలగించడం లేదు. రజకులతో మాట్లాడకూడదని, మాట్లాడితే జరిమానా విధిస్తామని చెబుతున్నారు.
– కొండపల్లి వెంకటరత్నం, చిడిపి
ఒప్పకోవడం లేదు
రెండు వర్గాల మధ్య మాటల్లేవు. 2011 నుంచి చెరువు ఆక్రమణ తొలగించాలని వివాదం నడుస్తుంది. గ్రామ పెద్దలంతా కలిసి ఇరు పక్షాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించాం. పలుమార్లు చర్చలు జరిపాం. రజకుల కుల బహిష్కరణ అంశం నా దృష్టికి వచ్చింది. పరిష్కారానికి ఇరు పక్షాలు ఒప్పుకోవడం లేదు.
– పాలగుడుల లక్ష్మణరావు, సర్పంచ్, చిడిపి
●

కోర్టుకు వెళ్లామని ఇబ్బంది