అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో ఆదివారం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకుడు ముత్య వేంకట్రావు తదితరులు పూజలు చేశారు. రత్నగిరిపై రామారాయ కళావేదిక మీద సూర్య నమస్కారాలు, సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.