కొత్త వ్యాపారులే ఈ భార్యభర్తల టార్గెట్‌.. లక్షల్లో.. | Wife And Husband Cheats New Business Men In Hyderabad | Sakshi
Sakshi News home page

కస్టమర్లు ఉన్నారంటూ రూ. లక్షల్లో సరుకుల కొనుగోలు..

Dec 18 2020 8:16 AM | Updated on Dec 18 2020 8:16 AM

Wife And Husband Cheats New Business Men In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వ్యాపారులను నమ్మించి మోసం చేస్తున్న దంపతులపై చిలకలగూడ పోలీసులు కే సు నమోదు చేశారు. సీఐ బాలగంగిరెడ్డి తెలిపిన మేరకు..మైలార్‌గడ్డకు చెందిన మహ్మద్‌ అబ్ధుల్‌ వాజిద్‌ (42), రెహానాబేగంలు భార్యభర్తలు. వీరు నూతనంగా వ్యాపారం ప్రారంభించిన వారినే టార్గెట్‌ చేస్తారు. తమకు అనేకమంది కస్టమర్లు ఉన్నారని పెద్ద ఎత్తున సరుకులు కొనుగోలు చేస్తారు.  ఆ తరువాత వాటిని ఇతర మార్కెట్లు, సన్నిహితులకు అదే రేటుకు విక్రయిస్తారు. ఇలా రెండు మూడు సార్లు చేస్తారు. దీంతో వ్యాపారులకు నమ్మ కం కలుగుతుంది. కొద్ది రోజుల తరువాత తాము టూర్‌లో ఉన్నామని, పది నుంచి 15 రోజులు పడుతుందని, వర్క్‌ర్స్‌ను పంపిస్తాం అర్జంట్‌గా వస్తువులు కావాలని చెప్పి లక్షలాది రూపాయల విలువైన వస్తువులు తెప్పించుకుంటారు. వాటిని ఇతర మార్కెట్లతో సగం ధరకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తారు. ఇలా మోసపోయిన బాధితుడు అబ్ధుల్‌కయూమ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి సహకరిస్తున్న ఫిరోజ్, ఖాదర్‌లపై చీటింగ్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement