
వైఎస్సార్: ఓ విద్యార్థిని మృత్యువు వెంటాడింది. ప్రమాదం జరిగి కోలుకోక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. విషాదకర సంఘటన వివరాలలోకి వెళ్తే ... మండలంలోని బొందలకుంట గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ (18) అనే విద్యార్థి ఇంటరీ్మడియెట్ ఓపెన్ పరీక్ష రాయడానికి మోటార్ బైక్‌పై గురువారం జమ్మలమడుగుకు వెళ్తుండగా ముద్దనూరు–జమ్మలమడుగు మార్గంమధ్యలో అదుపు తప్పింది.
ఈ ప్రమాదంలో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రుడు కోమాలోకి వెళ్లాడు. దీంతో కర్నూలులో పరిస్థితి విషమించడంతో వైద్యులు కడప రిమ్స్‌కు వెళ్లి అక్కడే చికిత్స తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అరుణ్ తల్లిదండ్రులు అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు బయలుదేరారు. గురువారం రాత్రి కడపకు వస్తుండగా ఖాజీపేట వద్ద హైవేపై వంతెనను ఢీకొని అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అరుణ్‌కుమార్ మృతి చెందాడు. అతడి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడి మరణంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.