బిల్డింగ్‌కు వేలాడుతూ నర్సు డెడ్‌బాడీ.. అత్యాచారం చేసి ఆ తర్వాత..?

Nurse Found Hanging In UP Hospital - Sakshi

Nurse Suicide.. ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్న నర్సు.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నర్సింగ్ హోమ్ గోడకు వేలాడుతున్న మహిళ మృతదేహం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఉన్నావ్‌లోని న్యూ జీవన్ హాస్పిటల్‌లో ఓ మహిళా నర్సు శుక్రవారమే విధుల్లో చేరింది. తర్వాత రోజు శనివారమే నర్సింగ్‌ హోమ్‌ గోడకు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆమె మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్న తర్వాత వారు షాకింగ్‌ విషయాలు చెప్పారు. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఇలా హత్య చేశారని ఆరోపించారు. నర్సింగ్‌హోమ్ నిర్వాహకుడితో సహా మరో ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేశారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఉన్నావ్ అదనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఆమెపై అత్యాచారం జరిగిందా..? లేక ఆమెనే ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: విద్యార్థినితో మాట్లాడాలని గదిలోకి పిలిపించుకుని..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top