దూరంగా వెళ్లి మూత్రం పోయమన్నందుకు కత్తితో పొడిచి..

Mumbai: Man Stabbed Death Asking Youth To Not Urinate By His Close - Sakshi

ముంబై: ఇటీవల జరుగుతున్న పలు ఘటనలను చూస్తుంటే.. క్షణికావేశంలో, చిన్న చిన్న గొడవలకు కూడా కొందరు హత్యలకు పాల్పడుతున్నారు. ఓ వ్యక్తి తనకు దూరంగా మూత్రం పోయమని చెప్పిన వ్యక్తిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహరాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మహ్మద్ రఫీక్ అన్సారీ (41) తన స్నేహితుడితో చాట్ చేస్తున్నప్పుడు నిందితుడు మహ్మద్ అబ్దుల్లా ఆలం షేక్ (24) ఆ ప్రాంతానికి వచ్చాడు. 

ఆ వ్యక్తి వారిద్దరు కూర్చున్న ప్రదేశానికి దగ్గరగా మూత్ర విసర్జన చేయడం మొదలుపెట్టాడు. దీంతో కాస్త దూరంగా వెళ్లి మూత్ర విసర్జన చేయాలని అన్నారీ షేక్‌కు చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. అలా చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారిన నేపథ్యంలో ఆగ్రహంతో షేక్‌ కత్తితో అన్నారీని దారుణంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్నారీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అన్సారీని హత్య చేసిన నిందితుడు షేక్‌ను వదలా ట్రక్ టెర్మినల్ స్టేషన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

చదవండి: పని మీద ఢిల్లీకి వచ్చిన మహిళపై సామూహిక లైంగిక దాడి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top