అక్క పెళ్లికి డబ్బు కోసం హత్య | Man Murder For His Sister Marriage In Karnataka | Sakshi
Sakshi News home page

అక్క పెళ్లికి డబ్బు కోసం హత్య

Feb 9 2021 8:01 AM | Updated on Feb 9 2021 9:34 AM

Man Murder For His Sister Marriage In Karnataka - Sakshi

వీరేంద్ర అక్క పెళ్లి ఉంది. పెళ్లికి డబ్బుల కోసం హత్యకు పథకం వేశాడు..

సాక్షి, తుమకూరు(కర్ణాటక): కొరటిగెరెలో ఇటీవలె కారు డ్రైవర్‌ను కత్తితో పొడిచిచంపి కారును కరెంటు స్తంభానికి ఢీకొట్టి యాక్సిడెంట్‌గా చూపడానికి యత్నించిన నిందితుడిని పోలిసులు అరెస్టు చేశారు. నిందితుడు బెంగళూరు అత్తిబెలివాసి వీరేంద్ర (24). ఫిబ్రవరి 16న వీరేంద్ర అక్క పెళ్లి ఉంది. పెళ్లికి డబ్బుల కోసం హత్యకు పథకం వేశాడు. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటిలో కారు డ్రైవర్, యజమాని అయిన నిసార్‌ అహ్మద్‌ (35)ను కొరటిగెరెకు వెళ్దామని తీసుకొచ్చాడు. అక్కడ కారును దొంగిలించాలని పథకం వేశాడు. డ్రైవర్‌ నిస్సార్‌ కారులో విశ్రమిస్తుండగా చాకుతో అతని యెదపైన నాలుగైదు సార్లు పొడిచి కారుతో చెట్టుకు ఢీకొట్టించాడు. కారు దెబ్బతినడంతో వెంట తీసుకెళ్లలేక పరారయ్యాడు.

చదవండి: ప్రేమపెళ్లి: బాలికను వివాహమాడిన మరో బాలిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement