మైనర్‌ బాలికను గదిలో బంధించి ఏడాదిగా అత్యాచారం.. | Man Held For Molesting Minor Girl And Forcefully Marry In Bhopal | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికతో పెళ్లి.. గదిలో బంధించి తరచు అత్యాచారం..

Mar 18 2021 10:42 AM | Updated on Mar 18 2021 11:11 AM

Man Held For Molesting Minor Girl And Forcefully Marry In Bhopal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నిందితుడు బాలిక కుటుంబానికి సుపరిచితుడు కావడంతో తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి మైనర్‌ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతు వచ్చాడు.

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మైనర్‌ బాలికపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడమే కాకుండా బలవంతంగా ఆమెను వివాహం చేసుకున్న కేసులో  28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని నిషాంత్‌పురాకు చెందిన 14 ఏళ్ల బాలికపై నిందితుడు గతేడాది మేలో మొదటిసారిగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు బాలిక కుటుంబానికి సుపరిచితుడు కావడంతో తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు.

ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి మైనర్‌ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతు వచ్చాడు. ఈ నేపథ్యంలో గతేడాది అగష్టులో నిందితుడు అతని తల్లి బాధిత బాలిక కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి ఆమెను బలవంతంగా వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం బాలికను ఇంట్లోని ఓ గదిలో బంధించి తరచూ అత్యాచారం చేస్తూ భౌతికంగా హించడం మొదలు పెట్టారు. అయితే బాలిక తన కుటుంబ సభ్యులను కలిసేందుకు వారు నిరాకరించేవారు.

ఒకవేళ ఆమె కలిసేందుకు ప్రయత్నించిన నిందితుడి తల్లి విచక్షణ రహితంగా దాడి చేసేదని బాలిక పోలీసులతో పేర్కొంది.  ఈ క్రమంలో బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం, అత్యాచారం కింద పలు కేసులు నమోదు చేసి నిందితుడి అరెస్టు చేయగా అతడి తల్లి పరారీలో ఉన్నట్లు పోలీసుల తెలిపారు. అయితే నిందితుడు తన దగ్గర వివాహ ధృవీకరణ పత్రాలు ఉన్నాయని పోలీసులతో పేర్కొన్నాడు. బాధితురాలు మైనర్‌ కావడంతో ఈ వివాహ పత్రాలు ఎలా వచ్చాయి, నిందితుడికి ఎవరూ సహకరించారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement